You are here

SP Office and Sarpavaram Police Station will Inaugurate by AP CM Chandrababu

SP Office and Sarpavaram Police Station will Inaugurate by AP CM Nara Chandrababu Naidu on 21st September 2018. SP Office which was constructed with 8 crore rupees with all the facilities like Control Room, Fitness Centre, Multi Purpose Meeting Hall, IT Course Centre.

 

sp-office-kakinada.jpg

 

ఆధునిక వసతులతో ఎస్పీ కార్యాలయం  

  • సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రిచే ప్రారంభం  
  • అదే రోజు సర్పవరం పోలీస్ స్టేషన్ ప్రారంభం 

ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఈనెల 1న కాకినాడలో పర్యటించాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అయిన విషయం తెలిసిందే...అయితే ఈ నెల 21న ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయింది దానిలో భాగంగా ఎస్పీ కార్యాలయం ప్రారంభించే అవకాశం ఉంది.

 

ఆగష్టు 23,2018: (ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హోమ్ మంత్రి చినరాజప్ప ఎస్పీ కార్యాలయాన్ని సందర్శినప్పటి వివరాలు) 

 

sp-office-kakinada2.jpg

 

జిల్లా కేంద్రమైన కాకినాడలో అత్యాధునిక సదుపాయాలతో 8 కోట్ల రూపాయల వ్యయంతో ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించడం జరిగిందని డిప్యూటీ సీఎం మరియు హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాకినాడలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని నేడు మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ప్రారంభిస్తారని అదేరోజు సర్పవరంలో నిర్మించిన పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభిస్తారని అన్నారు.

 

sp-office-kakinada3.jpg

 

కాకినాడలో ఉప్పుటేరుపై రూ.140 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు శంకుస్థాపన చేస్తారని, రాజానగరం సామర్లకోట మధ్య 250 కోట్లతో చేపట్టే ఎడిబి రోడ్డు పనులు కూడా శంకుస్థాపన చేస్తారని తెలిపారు. కాకినాడలో నిర్మించిన ఈ భవనం ఎస్పీ కార్యాలయంలోని అన్ని విభాగాలు కలిగివుండటంతోపాటు కంట్రోల్ రూమ్, ఫిట్నెస్ సెంటర్, మల్టీపర్పస్ మీటింగ్ హాల్, ఐటి కోర్స్ సెంటర్ వంటి సదుపాయాలు కలిగి ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యలయంలోని పలు విభాగాలను చినరాజప్ప పరిశీలించారు.

 

sp-office-kakinada1.jpg

 

ఎస్పీ విశాల్ గున్నీ కార్యాలయంలో ఉన్న సదుపాయాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ వివరిస్తూ ప్రస్తుతం నగరంలోని 120 సిసి కెమెరాలు వివిధ కూడళ్లలో పనిచేస్తున్నాయని త్వరలో మరికొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

 

sp-office-kakinada4.jpg

 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం వెంట కలెక్టర్ కార్తికేయ మిశ్రా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కాకినాడ డి ఎస్పి రవివర్మ, ట్రాఫిక్ డిఎస్పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.