You are here

Teachers Must Use Digital Devices - Municipal Comissioner Ramesh

Teachers Must Use Digital Devices - Municipal Comissioner Ramesh

 

Comissioner-Ramesh.jpg

 

ఉపాధ్యాయులు విధిగా డిజిటల్ పరికరాలను వినియోగించాలి - మున్సిపల్ కమిషనర్ రమేష్.

ఉపాధ్యాయులు డిజిటల్ పరికరాలను వినియోగించి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేరీతిలో విద్యాబోధన చేయాలని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె రమేష్ సూచించారు. బుధవారం స్థానిక రమణయ్య పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర మున్సిపల్ విద్య సలహాదారు డి. వి. రావు తో కలిసి సందర్శించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం జరుగుతున్న ప్రత్యేక తరగతులను,  అదేవిధంగా పౌండేషన్ కోర్సుకు   సంబంధించి  జరుగుతున్న తరగతుల తీరును వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా కమిషనర్ కె రమేష్  పదవ తరగతి విద్యార్థులు తన విద్యాభ్యాసం లో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   పదవ తరగతి విద్యార్థులు అందరూ నూరు శాతం ఉత్తీర్ణులు అవ్వాలని , ఎక్కువమంది 10 జీ పి ఎ లు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు అందరూ విధిగా డిజిటల్ పరికరాలను వినియోగించాలని ఆదేశించారు. రాష్ట్ర మున్సిపల్ విద్య సలహాదారు డి వి రావు ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా గత సంవత్సరం పదో తరగతి పరీక్షల ఫలితాలు లో 10 జి పి ఎల్ సాధించినందుకు ఉపాధ్యాయిని,  ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్ష ఫలితాలు లో కూడా మరిన్ని 10 జి పి ఎ లు సాధించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అకాడమిక్ కోఆర్డినేటర్ ఎస్ వి ఎస్ రాజు,  వి మహేష్ , స్కూల్ సూపర్వైజర్ జి వి వి సత్యనారాయణ,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హనుమంతరావు,  ఉపాధ్యాయినీ,  ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Share this content.