You are here

Two more Society Branches in District

Brahman Credit Co-Operative Society will get Two more Society Branches in District.

 

cm.jpg

 

జిల్లాలో మరో రెండు సొసైటీ శాఖలు

  • పధకాల లబ్ది లో జిల్లా ముందంజ

బ్రాహ్మణ కార్పొరేషన్ కు అనుబంధంగా ఉన్న బ్రాహ్మణ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ మరో రెండు శాఖలు తూర్పుగోదావరిజిల్లా లో రానున్నాయని కార్పొరేషన్ డీ ఎల్ ఓ డీ హెచ్ వి సాంబశివరావు తెలిపారు.బ్రాహ్మలు ఎక్కువ గా ఉన్న అమలాపురం, రాజమహేంద్రవరం లలో ఈ వ్యవస్థ లు ఏర్పాటు చేస్తామని కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తెలిపారు అన్నారు.శనివారం కాకినాడ రూరల్ కరప లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లో జరిగిన బ్రాహ్మణ సమావేశం లో సాంబశివరావు మాట్లాడుతూ రెండు రోజుల పాటు డీఎల్ఓ లు అందరికి కార్పొరేషన్ నాయకత్వ లక్షణాలు పెంపు పై శిక్షణ ఇచ్చిందని అన్నారు.ఈ సందర్భం గా చైర్మన్ వేమూరి తూర్పుగోదావరిజిల్లాలో బ్రాహ్మణ చైతన్యం అధికం గా ఉందని కార్పొరేషన్  తరపున రూ 9.5 కోట్లు, సొసైటీ తరపున రూ 1.10 కోట్లు ఈ జిల్లాకే లబ్ది చేకూర్చినట్లు గణాంకాలు వెల్లడించారు అన్నారు.ఇదే సందర్భం లో అమలాపురం, రాజమహేంద్రవరం లలో సొసైటీ బ్రాoచిల ఏర్పాటు పై హామీ ఇచ్చారు అన్నారు.అలాగే కాకినాడ చార్టిస్ వేద పాఠశాల విద్యార్థులుకు వేద వ్యాస పధకం లో స్కాలర్షిప్స్ రాని విషయాన్ని ఆయన దృష్టి కి తాను తేగానే వెంటనే జనరల్ మేనేజర్లు వెంకట శాస్త్రి, భావాణిశంకర్ లతో మాట్లాడారు అని చార్టిస్ ఇఓ నుoచి ఓ లేఖ తీసుకుని విద్యార్థుల తో దరఖాస్తు పెట్టించమని వెంటనే సమస్య పరిష్కరించబడింది అన్నారు.ప్రభుత్వ ఇతర కార్పొరేషన్ లు గురించి కూడా డీ ఎల్ ఓలు ప్రచారం చేసి వారు అంతా టీడీపీ ప్రభుత్వం కు మద్దతు పలికెలా డీ ఎల్ ఓ లు పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు అన్నారు.కాగా కరప, కాకినాడ రూరల్ మండలాలకు త్వరలోనే గౌరవ ఎమ్మెల్యే సిఫార్సు తో బ్రాహ్మణ మిత్రల నియామకం చేస్తున్నామని తెలిపారు.కరప మండల బ్రాహ్మణ సమస్యలపై చర్చించారు.త్వరలోనే అన్ని గ్రామాల్లో పర్యటన చేయాలని నిర్ణయించామని సాంబశివరావు తెలిపారు.సమావేశంలో నాయకులు పెద్దింటి ఆనంతాచార్యులు, గోపాలకృష్ణ, కొక్కిరిగడ్డ సుబ్రహ్మణ్యం, మణికంఠ, జొన్నలగడ్డ కామేష్ నందిని, అల్లంరాజు సత్యనారాయణ, ఎం వరాహ నరసింహమూర్తి, ఫణికుమార్, చంటి, చక్రవర్తుల వేణు, లక్ష్మీ, దువ్వూరి కృష్ణ,  ఎండిఓ కామశాస్త్రి, జిల్లా ఆర్ బి ఎస్ మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శిలు మాదభూషి గోడవర్తి లక్ష్మీ, గుడిపాటి బంగారం తదితరులుపాల్గొన్నారు.

Advertisement

Share this content.