You are here

Use Clay Idols for Vinayaka Chavithi Celebrations - Joint Collector

Use Clay Idols for Vinayaka Chavithi Celebrations said Joint Collector A.Mallikarjuna

 

DSC_8210-01.jpg

 

వినాయక చవితికి మట్టి విగ్రహాలనే వాడండి - జాయింట్ కలెక్టర్ 

వినాయక చవితి సందర్భంగా సహజసిద్ధమైన మట్టి వినాయక విగ్రహాలను ఆరాధించి ప్రకృతి పరిరక్షణ లో భాగస్వాములు కావాలని  జాయింట్ కలెక్టర్ ఏ. మల్లికార్జున ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

నేడు మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాలులో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టవలసిన చర్యలపై జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జున రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్, ఇరిగేషన్, ఫిషరీస్, ఎక్సైజ్, కాలుష్య నియంత్రణ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనిక పదార్థాలతో చేసిన విగ్రహాలను జలవనరుల లో నిమజ్జనం చేయడం వల్ల వాటిలోని జీవరాశికి హాని కలిగించే పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.  హానికరమైన రంగులతో చేసిన విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాలను ఆరాధించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Share this content.