You are here

Trending Now

కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి(గ్రీవెన్స్‌) నిర్వహించనున్నారు. కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ ఉదయం 10 గంటల నుంచి స్వయంగా వినతులు స్వీకరిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ప్రజావాణి నేడు

చంద్రన్న బీమా పథకంలో పాలసీదారులు అంతా రూ.15 సేవా రుసుం తప్పకుండా చెల్లించి రశీదులు పొందాలని డీఆర్‌డీఏ పీడీ ఎస్‌.మల్లిబాబు తెలిపారు.

చంద్రన్న బీమా

ఈనెల 22న మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. గురువారం పాదగయ క్షేత్రంలో ఉత్సవాలకు సంబంధించి ఆలయ ఛైర్మన్‌ కొండేపూడి ప్రకాష్‌ అధ్యక్షతన ధర్మకర్తలు, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.

పాదగయలో ఈనెల 22న మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి

ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలను సమగ్ర మూల్యాంకన విధానం(సీసీఈ)లో అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ ఆ పరీక్షల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధానంలో 80 మార్కులు ప్రశ్నపత్రం ద్వారా, మరో 20 మార్కులు ఇంటర్నల్‌(ప్రాజెక్టు వర్క్‌)కు కేటాయిస్తారు.వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలకు కూడా అందచేయనున్నారు.

10th Class Model Papers for Schools

Those Who are Attending Sub Inspector mains, for them this month on 5th Sunday the Model Exam held in Shyam Institute. The Exams will start from 10.am to 1.pm Paper - 3 ( Arithmetic )  Afternoon from 2.30. pm to 5.30.pm Paper - 4 ( General Studies ) 

On 5th Model Exam for Sub Inspector

జిల్లాలో తుని మండలం హంసవరం, శంఖవరం ప్రాంతాలలో గల ఆదర్శ పాఠశాల(మోడల్‌ స్కూళ్లు)ల్లో 2017-18 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్‌.నరసింహారావు తెలిపారు. సంబంధిత పాఠశాలల్లో మార్చి 5న 9 గంటల నుంచి 11 వరకూ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారని తెలిపారు. అయిదో తరగతి స్థాయిలో ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో ఈ పరీక్షను నిర్వహిస్తారని వివరించారు.

మార్చి 5న ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష

జిల్లాలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా వచ్చేనెల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘డిజిధన్‌’ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆయన వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 95 శాతం డ్వాక్రా మహిళలు, 99 శాతం ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయన్నారు.

వచ్చేనెల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘డిజిధన్‌’ మేళా

డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా నగదు రహిత లావాదేవీలు పెంచటానికి జిల్లాలో ఖాళీగా ఉన్న, కొత్త మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి రాత పరీక్ష నిర్వహించనున్నట్లు సంయుక్త కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. 362 గ్రామ పంచాయతీల పరిధిలో 93 మీ-సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఖాళీలకు 260 మంది దరఖాస్తు చేశారని తెలిపారు.

మీ-సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి రాత పరీక్ష

అయిదేళ్లలోపు చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ జిల్లావాసులకు పిలుపు నిచ్చారు.దీని కోసం 3,582 శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. సమీపంలో ఉన్న శిబిరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.

కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ సమీపంలో ఉన్న శిబిరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు

 రాష్ట్ర సమాచార కమిషనర్‌ పి.విజయబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు. ఈనెల 31న ఉదయం 8.05 గంటలకు ఆయన విమానంలో రాజమహేంద్రవరం చేరుకుంటారు.ఫిబ్రవరి 3 వరకూ ఆయన కాకినాడలో ఉంటారు. ఈనెల 31 ఉదయం 10.30 గంటలకు స.హ.చట్టం అప్పీళ్లపై కలెక్టరేట్‌లో విచారణ నిర్వహిస్తారు.అక్కడ్నుంచి ఉదయం 9.30 గంటలకు కాకినాడ ర.భ.శాఖ అతిథి గృహానికి చేరుకుంటారు. ఫిబ్రవరి 3 వరకూ ఆయన కాకినాడలో ఉంటారు.

రాష్ట్ర సమాచార కమిషనర్‌ పి.విజయబాబు ఈనెల 31న జిల్లాకు రానున్నారు

కాకినాడలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 30న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.శాంతి తెలిపారు.ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల వయసులోపు అభ్యర్థులు అర్హులన్నారు. హోప్‌ ఇంటర్నేషనల్‌(కాకినాడ)లో బిల్లింగ్‌ క్లర్కు, అకౌంట్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ముఖాముఖి నిర్వహిస్తారన్నారు.

Job Mela on 30th

తుని జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఈనెల 28 ఉదయం 9 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ వీఎన్‌ రావు తెలిపారు. యనమల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వికాస సౌజన్యంతో దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ పూర్తిచేసిన 30 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని తెలిపారు.

Tomorrow Job Mela

Advertisement

Share this content.